News April 25, 2024

ఖమ్మంలో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తాన్

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ముందడుగు వేశాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన భారీ ర్యాలీలో ఆయా పార్టీల శ్రేణులు భాగస్వాములయ్యాయి.

Similar News

News April 13, 2026

ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

image

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News April 12, 2026

మధిర: ఇంటర్‌ రిజల్ట్.. 1000/992 మార్కులు

image

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.