News August 11, 2025
ఖమ్మంలో ర్యాలీపై కలెక్టర్‌కు బీజేపీ ఫిర్యాదు

పాలస్తీనా సంఘీభావం పేరుతో ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులను అనుమతి లేకుండా పాల్గొన్నారని, జాతీయ జెండాతో పాటు విదేశీ జెండాలను ఊపడం దేశ ద్రోహమన్నారు. మతపరమైన భావజాలాన్ని పిల్లల మదిలో నింపే ప్రయత్నం చేయడం సరికాదని, చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 13, 2026
ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైంది: ట్రంప్

తాము చేస్తున్న దాడులకు భయపడిపోయి ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైందని US అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని Axios వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. ‘లీడర్ అంటూ ఎవరూ లేరు. అందుకే లొంగిపోవడం గురించి ఎవరూ ప్రకటించలేదు’ అని పేర్కొన్నారు.
News March 13, 2026
ధైర్యంగా పరీక్షలు రాయండి: కలెక్టర్ రాహుల్ శర్మ

శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. సరైన ప్రణాళిక, సమయపాలన పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుపై పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఇది విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమని కలెక్టర్ గుర్తుచేశారు.
News March 13, 2026
జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజల గృహ అవసరాల కోసం అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు.


