News April 27, 2024
ఖమ్మంలో హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం!

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేశ్
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Similar News
News April 14, 2026
గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.
News April 14, 2026
ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


