News December 3, 2025

ఖమ్మం: అయ్యప్ప భక్తులకు శుభవార్త

image

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నెల (డిసెంబర్) 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్‌ను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.

Similar News

News February 17, 2026

కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పటి నుంచో తెలుసా..

image

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

News February 17, 2026

సంగారెడ్డి: ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ పరీక్షలకు 35,986 మంది విద్యార్థులు హాజరవుతారని, 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించబడతాయని, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు.

News February 17, 2026

ఈ జిల్లాల్లో అకాల వర్షాలు

image

TG: ఈ నెల 22, 23, 24 తేదీల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 22న నార్త్, ఈస్ట్ జిల్లాల్లో (ఆదిలాబాద్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల etc), 23, 24 తేదీల్లో HYD, WGL, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడొచ్చని తెలిపారు. ఈ నెల 20 నాటికి దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.