News August 15, 2025

ఖమ్మం: అల్లినగరానికి స్వాతంత్రోద్యమంలో ప్రత్యేక స్థానం

image

స్వాతంత్రోద్యమంలో మధిర(M) అల్లినగరం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామం నుంచి దాదాపు 15 మంది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అల్లినగరంలో పుట్టిన ప్రతి బిడ్డ స్వాతంత్ర్యం కోసం పని చేశారని స్థానికులు గర్వంగా చెబుతారు. స్వాతంత్ర్య సమరయోధులుగా వట్టికొండ రామకోటయ్య, ఆయన సోదరులు నాగేశ్వరరావు, లక్ష్మీకాంతయ్యతో పాటు నీరుకొండ అప్పారావు, వాకిడి సత్యనారాయణ, జానయ్య, తదితరులు జైలు జీవితం గడిపారు.

Similar News

News March 11, 2026

కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

image

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

సంగారెడ్డి: 12న మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈనెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం-2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

News March 11, 2026

2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

image

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.