News March 13, 2025

ఖమ్మం: ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీ

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌‌నగర్‌కు, జీ.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

Similar News

News February 17, 2026

ఖమ్మం: పీఎం శ్రీలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: DEO

image

రాష్ట్రంలో పీఎం శ్రీ పాఠశాలల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని DEO చైతన్య జైని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో 28పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల మేరకు వినూత్న బోధన, విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలని సూచించారు.

News February 17, 2026

ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్‌

image

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

News February 17, 2026

ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.