News December 1, 2025

ఖమ్మం: ఒకే ఊరు.. రెండు పంచాయతీలు

image

కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా (ఈశ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు) విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన వల్ల ప్రజలకు పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి.

Similar News

News February 16, 2026

ఖమ్మం: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం డివిజన్‌లో 98 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: ☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380 ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.

News February 16, 2026

యూజీసీ మార్గదర్శకాల మేరకు సిలబస్ మార్పులు

image

కేయూలో నాన్‌ప్రొఫెషనల్ పీజీ కోర్సుల సిలబస్‌ను జాతీయ పీజీ ప్రోగ్రామ్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం సూచనల మేరకు 3, 4 సెమిస్టర్లలో రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ ప్రాజెక్ట్ తప్పనిసరి చేశారు. 2026-27 నుంచి ప్రాజెక్ట్ గైడ్షిప్‌ను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్‌టైమ్ అధ్యాపకులకు కూడా కేటాయించనున్నారు.

News February 16, 2026

NZB: మేయర్ అభ్యర్థిగా ఉమారాణి ఖరారు?

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సమాచారం. అయితే రమేశ్ గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి రావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు.