News December 2, 2025

ఖమ్మం: ఓటు హక్కుపై యువత వినూత్న కార్యక్రమం

image

ప్రజాస్వామ్య బలోపేతంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సోమవారం ‘Cast Your Vote’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వారు తమ సామాజిక బాధ్యతను చాటుకుని, మిగతా యువత అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News February 13, 2026

పార్వతీపురం: విద్యాసంస్థల్లో మరమ్మతు పనులు వేగవంతం చేయాలి

image

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు వంద శాతం పనితీరులో ఉండాలని, నీటి సౌకర్యం, శానిటేషన్ పనులపై ఏఈఈలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

News February 13, 2026

రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.

News February 13, 2026

పరిగి మున్సిపాలిటీలో ‘హంగ్’

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పరిగిలో ‘హంగ్’ ఏర్పడింది. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంలో వారు కీలకంగా మారారు. ప్రధాన పార్టీల బలాబలాలు సమానంగా ఉండటంతో, స్వతంత్రుల మద్దతు ఎటువైపు ఉంటే వారికే ఛైర్మన్ పీఠం దక్కనుంది.