News March 25, 2024

ఖమ్మం: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

Similar News

News December 16, 2025

ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

image

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.

News December 16, 2025

మూడో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు, కౌంటింగ్ 2 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు చర్యలు: కలెక్టర్

image

రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.