News March 13, 2025

ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

image

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద పసుపు పంట కొనుగోలు చేయాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చిలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశముందని, రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 7, 2026

ఖమ్మం: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని, అర్హులు I&PRవెబ్‌సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల జాబితాను డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

News February 6, 2026

ఖమ్మం: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‘రాయ’బారమేదీ?

image

ఏదులాపురం పుర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గైర్హాజరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పాలేరులో పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, వందలాది గ్రానైట్ పరిశ్రమలున్న ఈ మున్సిపాలిటీలో అంటీముట్టనట్లు ఉండటం వెనుక మంత్రి పొంగులేటి శిబిరం నుంచి పిలుపు అందకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు చర్చించుకుంటున్నారు.