News August 21, 2025

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ..!

image

రైతాంగానికి తక్షణ యూరియా సరఫరా అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూరియా కొరతపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితమని పేర్కొంటూ, సమస్యలపై అవగాహన లేకుండా రాంచందర్‌రావు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ‘సవాళ్లు విసరడం కాదు, రైతుల సమస్య పరిష్కారం చేయడమే ప్రాధాన్యం’ అని తుమ్మల స్పష్టం చేశారు.

Similar News

News January 24, 2026

బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

image

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.

News January 24, 2026

నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

image

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.

News January 24, 2026

14 మందితో చెరువుగట్టు ఉత్సవ కమిటీ

image

చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు 14 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెరువుగట్టు ఈఓ మోహన్ బాబు తెలిపారు. సభ్యులుగా వరాల రమేష్, రంగ శ్రవణ్, మందుల నరసింహ, కొమ్ము శ్రీసు, గౌరుదేవి లక్ష్మయ్య, రేగటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల అనితతో పాటు మరో ఏడుగురు సభ్యులుగా నియమితులయ్యారు.