News February 27, 2025
ఖమ్మం: కేంద్ర హోంమంత్రికి పొంగులేటి వినతి

సత్తుపల్లి కిష్టారం గ్రామంలో నిర్మించిన సైలో బంకర్ కారణంగా రెండేళ్ల మెయింటినెన్స్ పూర్తికాక ముందే గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్య కారణాలతో ఇబ్బందులు బాధపడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరించారు. అనంతరం అంబేద్కర్ నగర్ వాసుల ఇబ్బందులపై వినతిపత్రం అందించారు. భారీ బంకర్ నాణ్యత లోపించడంతో పగుళ్లు వచ్చాయని విచారణ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 27, 2025
ఖమ్మం: మద్యం అమ్మకాలు ఢమాల్!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ విక్రయాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 75 కోట్ల అమ్మకాలు జరగగా, ప్రస్తుత ఫిబ్రవరిలో రూ.65 కోట్ల సేల్స్ జరిగాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిళ్లలో ప్రభావం పడింది. పెరిగిన బీర్ల ధరలతో అమ్మకాలు మరింత క్షీణించవచ్చనే అభిప్రాయాలున్నాయి.
News February 27, 2025
ఖమ్మం: ‘24 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు’

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, రాజకీయ పరమైన సంక్షిప్త సందేశాలు పంపడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 27, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన.