News March 13, 2025
ఖమ్మం: గిట్టుబాటు ధర లేక మిర్చి రైతుల ఆందోళన

ఎన్నో ఆశలతో అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మిర్చి పంటను సాగు చేసిన రైతులను తెగుళ్లు వేధిస్తున్నాయి. మరోవైపు గిట్టుబాటు ధర లేక దిగులు చెందుతున్నారు. గతేడాది రూ.20,000 పైగా పలికిన మిర్చి ధర ఈ ఏడాది రూ.14,000 మించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతులకు కోరుతున్నారు.
Similar News
News February 7, 2026
విశాఖ: ఒకే ఒక్కడు.. 26 కేసుల్లో నిందితుడు

విశాఖ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అచ్చి మహేష్ రెడ్డిని గాజువాక క్రైమ్, సీసీఎస్, మల్కాపురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి-10, గాజువాక-8, మల్కాపురం-2 కేసులతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో ఆరు ఇతనిపై ఉన్నాయి. నిందితుడి నుంచి కేజీన్నార బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, BMW కారు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు కమిషనర్ వెల్లడించునున్నారు.
News February 7, 2026
400 సీట్లుకు దరఖాస్తు చేసుకోండి: డిప్యూటీ డైరెక్టర్

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మంగదయ్య శనివారం తెలిపారు. రాజవొమ్మంగి(బాలికలు ), రంపచోడవరం(బాలురు, బాలికలు), కూనవరం(బాలికలు ), అడ్డతీగల(బాలురు) పాఠశాలల్లో 400 ఖాళీలు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న st విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 28లోగా అప్లై చేసుకోవాలన్నారు.
News February 7, 2026
ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్

రూ. 28 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో పరారీలో ఉన్న కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ACBఅధికారులు అరెస్ట్ చేశారు. జనవరి 3న రేంజర్ రాజేందర్ రూ.3.50లక్షలు తీసుకుంటూ దొరికినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. వైజాగ్‌లో ఆమెను ACB అదుపులోకి తీసుకుంది. నేడుకోర్టులో ప్రవేశపెట్టనుంది. టన్ను యూకలిప్టస్ కర్రపై రూ. 90 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది.


