News December 1, 2025

ఖమ్మం: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

Similar News

News February 16, 2026

నేడే మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక.. కుర్చిలాటలో పైచేయి ఎవరిదో

image

ఉమ్మడి NLG జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా 17 మున్సిపాలిటీలకు నేడే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ మేయర్‌గా బుర్రి చైతన్య రెడ్డి ఖరారు కాగా మిగతా మున్సిపాలిటీల్లో తీవ్రమైన పోటీ ఉంది. ముందుగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోల్ బెల్ట్‌కు మేయర్.. మంచిర్యాలకు డిప్యూటీ.!

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. మేయర్ పదవి కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ మంచిర్యాల ప్రాంతానికి చెందిన సల్ల రమ్య పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సోమవారం జరగనున్న కార్పొరేట్ ప్రమాణ స్వీకార సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్ కవర్‌తో బయటపడనున్నాయి.