News November 19, 2025

ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News January 22, 2026

ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

image

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.

News January 22, 2026

భారత్ ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్‌మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్‌దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.

News January 22, 2026

చికిత్సకు డబ్బులు లేవని.. హృదయ విదారక ఘటన

image

TG: HYD కూకట్‌పల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. దివ్యాంగురాలైన కూతురు శ్రీజావలి(18) ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారు. తర్వాత 2రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇవాళ కొడుకు నితిల్‌తో కలిసి భార్యభర్తలు సతీశ్, ఆమని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది పనిచేయలేదని ముగ్గురూ చేతులు కోసుకున్నారు. బాధ భరించలేక నితిల్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.