News November 19, 2025

ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్‌ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.

Similar News

News January 23, 2026

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.

News January 23, 2026

వికారాబాద్ పాలిటిక్స్‌లో ‘వారసురాళ్ల’ జోరు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నేతల వారసురాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య, మరోవైపు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ కుమార్తె చంద్ర ప్రియ తమదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఛైర్‌పర్సన్ కుర్చీని కైవసం చేసుకుంటారో చూడాలి.

News January 23, 2026

చిత్తూరు: మూడు విడతల్లో ప్రాక్టికల్స్

image

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు విడతల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ డీఐఈవో తెలిపారు. మొదటి విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు, మూడో విడత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.