News August 22, 2025

ఖమ్మం: చెట్టును ఢీకొని వ్యక్తి SPOT DEAD

image

రఘునాథపాలెం మండలం చింతగుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పంగిడికి చెందిన రాందాస్ అనే వ్యక్తి ఖమ్మం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అతని బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాందాస్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

మేడారం జాతరలో భూపాలపల్లి కలెక్టర్

image

భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వీరస్వామి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి నిలువెత్తు బంగారం సమర్పించారు. జిల్లా ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

News January 24, 2026

జహీరాబాద్: చైనా మాంజాతో బాలుడికి తీవ్ర గాయం

image

జహీరాబాద్లో <<18948845>>చైనా మాంజా<<>> ఒక చిన్నారి ప్రాణం మీదికి తెచ్చింది. గాలిపటం దారానికి ఉన్న మాంజా తగిలి నాలుగేళ్ల బాలుడి మెడకు లోతైన గాయమై, తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిషేధిత మాంజా వాడకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

image

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్‌ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.