News August 12, 2025
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆప్డేట్

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. ఐదు నియోజకవర్గాలకు మొదటి విడతలో ప్రభుత్వం 16,153 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 12, 173 ఇళ్లకు ముగ్గుపోశారు. 6,630 బేస్‌మెంట్, 664 గోడలు, 418పై కప్పు పూర్తైయ్యాయి. 90 శాతం మందికి రూ. 61 కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
Similar News
News March 15, 2026
ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News March 14, 2026
తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.


