News February 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మార్కెట్‌కు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆}  మధిరలో అంతరాయం

Similar News

News April 17, 2026

ఖమ్మం: డీవైఎస్ఓ సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు

image

పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ గా తుంబూరు సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానంలో ఉన్న శ్రీలత ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. అయితే, ఆమె స్థానాన ఎవరినీ నియమించకపోవడంతో డీవైఎస్ఓగా ఉన్న సునీల్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యాన సజావుగా పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News April 17, 2026

ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

image

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2026

ఖమ్మం: ‘డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నగారా’

image

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.