News March 11, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

✓:వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ✓:ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ✓:నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం✓:ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ✓:వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన✓:ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు✓:పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ✓:మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News March 16, 2025
ఖమ్మం: అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య

ఓ వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడుకు చెందిన షేక్ మస్తాన్, జరీనా(28) దంపతులు. జరీనా అప్పటి వరకు ఇంట్లో పని చేసుకుంటుండగా, విశ్రాంతి తీసుకోడానికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్లు చూడగా, ఉరి వేసుకొని ఉంది. ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 16, 2025
ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట: పొంగులేటి

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.
News March 16, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) KG రూ. 160 ఉండగా, స్కిన్లెస్ కేజీ రూ. 180 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 110 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు.