News March 13, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు’

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం
Similar News
News February 13, 2026
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.
News February 13, 2026
ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.
News February 13, 2026
ర్యాలీలు, సంబరాలపై నిషేధం: ఖమ్మం సీపీ సునీల్ దత్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు తెలిపారు.


