News February 19, 2025
ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య

అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
News March 28, 2025
ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్‌ను పర్యవేక్షించింది.
News March 28, 2025
నత్తనడకన LRS ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.