News August 25, 2024
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్‌లో భారీ కుంభకోణం

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఖమ్మం జిల్లాల్లో పక్కదారి పట్టినట్లు సీఐడీ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నెల 23న ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు.
Similar News
News January 18, 2026
ఖమ్మం 45 ఏళ్ల నిరీక్షణకు సీఎం తెరదించేనా.. ?

ఖమ్మంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న 45 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలని విద్యావంతులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటన నేపథ్యంలో చారిత్రక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలను వర్సిటీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి అనుమతి లభించినా, ఖమ్మంలో జనరల్ వర్సిటీ అవసరమని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
News January 18, 2026
ఖమ్మం: ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధికి చేయూత

ఖమ్మం జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి కోసం 100% సబ్సిడీతో రూ. 75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి విజేత తెలిపారు. 18-55 ఏళ్ల వయస్సు ఉండి, కలెక్టర్ జారీ చేసిన ఐడీ కార్డు ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 25లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 18, 2026
ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.


