News August 23, 2025
ఖమ్మం జిల్లాలో 80 మందికి HMలుగా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా విధులు నిర్వర్తిస్తున్న 80 మందికి గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా పలువురు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక ఎస్జీటీలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాను ఈరోజు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 23, 2026
గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు!

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్’, ‘రెస్టిన్’ హోటల్ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.
News January 23, 2026
సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: ఖమ్మం అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఓనర్లు, డీలర్లు, సేల్స్ అధికారులు, పంప్ ఆపరేటర్లకు సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సీపీఆర్‌కు వైద్య అనుభవం అవసరం లేదని, సాధారణ ప్రజలు కూడా చేయవచ్చన్నారు.
News January 22, 2026
ఖమ్మం: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా హెచ్చు వెంకటేశ్వరరావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు ప్రకటించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఈయన ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల హక్కుల కోసం పోరాడుతూ సంఘాన్ని ముందుండి నడిపించాలని కోరారు.


