News November 17, 2025
ఖమ్మం డీసీసీ.. ఆ నలుగురిలో ఎవరో..?

ఖమ్మం DCC అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. భట్టి, పొంగులేటి వర్గాల నేతలు పీఠంపై కన్నేశారు. పార్టీ నిబంధనల కారణంగా కొత్తగా చేరిన వారికి అవకాశం లేకపోవచ్చు. 56 దరఖాస్తుల్లో నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మద్ది శ్రీనివాస రెడ్డి, మానుకొండ రాధాకిషోర్ తుది జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Similar News
News January 19, 2026
అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
News January 19, 2026
ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
News January 19, 2026
ఖమ్మం: ఉదారతను చాటుకున్న డీఈఓ

పదో తరగతి విద్యార్థులపై డీఈఓ చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 13 పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్నాక్స్ అందించాలని నిర్ణయించారు. సుమారు 250 మంది విద్యార్థులకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం రూ.20 విలువైన అల్పాహారం పంపిణీ చేయనున్నారు.


