News May 23, 2024
ఖమ్మం: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీపీ

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. నకిలీలను అరికట్టేందుకు 21 టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయొద్దన్నారు. అక్రమరవాణను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లను ఉంచామని పేర్కొన్నారు. తరుచూ నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు.
Similar News
News March 9, 2026
కామేపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కామేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఊట్కూరుకి చెందిన దుగ్గి సాయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ అఖిల్ పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 8, 2026
ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఖమ్మం ఎస్‌ఈ

ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఈ టెక్నాలజీతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడనుంది.
News March 8, 2026
ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.


