News August 22, 2025

ఖమ్మం: నిజాంను వణికించిన మన షోయబ్ ఉల్లాఖాన్

image

తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న రజాకార్ల కాలంలో రాక్షసతత్వాన్ని ఎదురించాడు ఖమ్మం జిల్లాకు చెందిన అక్షర యోధుడు షాహీద్ షోయబ్ ఉల్లాఖాన్. రజాకార్లు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై తన పెన్నుతో ఎక్కు పెట్టాడు. దీంతో నిజాం రాజుకు, ఖాసీం రజ్వీకి షోయబ్ ఉల్లాఖాన్ కలం పోటు తగిలి, బెదిరింపులు వచ్చాయి. ఈక్రమంలోనే 1948 ఆగస్టు 22న షోయబ్ ఉల్లాఖాన్ చేతులు నరికి, గుండెపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
# నేడు ఆయన వర్ధంతి

Similar News

News January 18, 2026

‘గ్రీన్‌లాండ్‌ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.

News January 18, 2026

కురబలకోట: వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు

image

కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లిలో వేటగాళ్లు పునుగు పిల్లిని వేటాడడం శనివారం వెలుగులోకి రావడం తెలిసిందే. నిందితులను పట్టు కునేందుకు అన్నమయ్య జిల్లా ఫారెస్ట్, మదనపల్లె అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి, వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పునికి పిల్లిని ప్రాణాలతో పట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

News January 18, 2026

జగిత్యాల: ఐదు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించి, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.