News August 22, 2025

ఖమ్మం: నిధులు దుర్వినియోగం.. జీపీ కార్యదర్శి సస్పెండ్

image

గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన జీపీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేశారు. వివరాలిలా.. వైరా మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యదర్శి కొంటా సునితా రూ.6,66,000 పంచాయతీ నిధులు దుర్వినియోగంకు పాల్పడగా, అధికారుల విచారణ చేశారు. రికార్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News January 24, 2026

యాదగిరిగుట్టలో రౌడీషీటర్ హత్య..UPDATE

image

యాదగిరిగుట్ట మైలార్‌గూడెం శివారులో ఓ కాటేజీలో శుక్రవారం <<18940229>>రౌడీషీటర్ <<>>నిశాంత్ ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన నిశాంత్ తన స్నేహితుడితో కలిసి కాటేజీకి వెళ్లగా, అక్కడ మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు నిశాంత్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. మృతుడిపై గతంలో 11కేసులున్నాయని, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తన మార్చుకోలేదని సీఐ భాస్కర్ తెలిపారు.

News January 24, 2026

ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాకు చెక్

image

ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక-మన వాహనం’ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 24గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. క్వారీ నుంచి ఇంటి దూరాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారంరోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

News January 24, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.