News August 13, 2025

ఖమ్మం: నీకు మరణం లేదు మిత్రమా..!

image

అమ్మ జన్మనిస్తే.. అవయవదానం పునర్జన్మనిస్తుంది. అవయవదానంపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా కొందరు అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. కూసుమంచి(M)చేగొమ్మకి చెందిన మహేశ్ ఈ ఏడాది జనవరి 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి మరణించారు. కుటుంబ సభ్యులు మహేశ్ అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం.

Similar News

News March 12, 2026

ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

image

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

News March 12, 2026

జగన్‌కు మంత్రి సవిత వార్నింగ్!

image

కూటమిపై బురద జల్లడం మానుకోవాలని జగన్‌కు మంత్రి సవిత హితువు పలికారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అన్నారు. ఆయనకు విజన్ లేదని, రాష్ట్రం గురించి ఆలోచన లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసినా జగన్ పారిపోయాడన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

News March 12, 2026

కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

image

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.