News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

Similar News

News February 27, 2025

అనకాపల్లి జిల్లాలో 85 శాతం పోలింగ్: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం ముగిసే సరికి 85 శాతం పోలింగ్ పూర్తయినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 357 పురుషుల ఓటర్లలో 273 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 257 మహిళా ఓటర్లలో 202 మంది తమ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

News February 27, 2025

మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

image

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.

News February 27, 2025

Stock Markets: బ్యాంకు షేర్లు అదుర్స్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,545 (-2), సెన్సెక్స్ 74,612 (10) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు నిఫ్టీ 135 Pts పెరిగి 48,743 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లు ఎగిశాయి. ఆటో, మీడియా, PSU బ్యాంకు, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎరుపెక్కాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్, హిందాల్కో, సన్‌ఫార్మా టాప్ గెయినర్స్.

error: Content is protected !!