News August 11, 2025

ఖమ్మం: పర్మిషన్ ఉండేది 7.. అక్రమంగా ఎన్నో..!

image

HYDలో సృష్టి ఫెర్టిలిటీ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జిల్లాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల తీరును త్వరలో రాష్ట్ర ఉన్నతాధికారులు తనిఖీ చేయనున్నారు. దీంతో అక్రమంగా సెంటర్లు నిర్వహిస్తున్న నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఖమ్మంలో 7 బేబీ సెంటర్లకు అనుమతి తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా అనేక సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఉన్నతాధికారుల తనిఖీలతో ఎవరి బాగోతాలు బయటపడతాయో త్వరలో తేలనుంది.

Similar News

News March 15, 2026

తుంగతుర్తి: బ్రాహ్మణులకు MLA సామేలు క్షమాపణ

image

బ్రాహ్మణ సమాజంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల MLA మందుల సామేలు విచారం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని, పొరపాటున దొర్లిన మాటలే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల పట్ల తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యల వల్ల బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇటీవల ఆయన వ్యాఖ్యలపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

News March 15, 2026

ఏప్రిల్‌లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

image

ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ డా. సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

News March 15, 2026

కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

image

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.