News March 28, 2024

ఖమ్మం: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

image

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ, సూర్యాపేట, ఇల్లందు, కొత్తగూడెం సత్తుపల్లి ప్రయాణించాలంటే గంటల కొద్దీ బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.

Similar News

News February 18, 2026

ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

ఖమ్మం: ‘అభివృద్ధి పనులు, రుణాల రికవరీపై సమీక్ష’

image

జిల్లాలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ బుధవారం సమీక్షించారు. ఉపాధి హామీ పనుల పురోగతి పెంచి, చెల్లింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి చేయాలని, ఎన్‌పీఏల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, గ్రాంట్ల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.