News March 27, 2024

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి నేను: తాండ్ర 

image

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం రూ. 12వేల కోట్ల (నేషనల్ హైవేలు, సంక్షేమ పథకాలు కలుపుకొని)ఖర్చుచేసినట్లు తెలిపారు. తాను గెలిస్తే మరింతగా జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. పలు సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి ఖమ్మం స్థానం కమలం కైవసం చేసుకుంటుందన్నారు.

Similar News

News February 12, 2026

రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

image

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.

News February 12, 2026

ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ‘కెమ్ డ్రా’ కోర్సు ప్రారంభం

image

ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కెమ్ డ్రా’ సర్టిఫికెట్ కోర్సును బుధవారం ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా ప్రారంభించారు. రసాయన పదార్థాల నిర్మాణాలు, వాటి పేర్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ కోర్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కెమిస్ట్రీపై పట్టు సాధించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.

News February 12, 2026

ఖమ్మం జిల్లాలో టాప్‌ కల్లూరు

image

కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాలోనే అత్యధికంగా 87.08 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. రామదుర్గారెడ్డి వెల్లడించారు. మొత్తం 18,866 ఓట్లకు గానూ 16,428 ఓట్లు పోలయ్యాయి. 20 వార్డుల్లో నిర్వహించిన పోలింగ్‌లో 6వ వార్డు 94.85 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, 20వ వార్డులో 75.85 శాతం పోలింగ్ నమోదైంది.