News November 19, 2025
ఖమ్మం: మార్చురీలో శవాలపై కక్కుర్తి వసూళ్లు

శవాలపై పేలాలు ఏరుకోవడం అనే డైలాగ్ వినే ఉంటాం. ఇలాంటి ఘటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది వ్యవహారంతో స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.3-5 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఏడాదికి 1000కి పైగా మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ దందాపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 22, 2026
అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
News January 22, 2026
చక్రాయపాలెంలో ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు

అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా, రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సీఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు.
News January 22, 2026
మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.


