News December 14, 2025
ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 13, 2026
నేడు ‘మంచుకొండ’ ఎత్తిపోతల పథకం ప్రారంభం

రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. ప్రభుత్వం నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ నేడు ప్రారంభించనున్నారు. రూ. 66.33 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 37 చెరువులను నింపుతూ సుమారు 3,500 ఎకరాలకు సాగర్ జలాలు అందనున్నాయి. 2025 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని, మంత్రి తుమ్మల చొరవతో ఏడాదిలోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రైతులకు అంకితం చేస్తున్నారు.
News January 12, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


