News December 3, 2025

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

image

ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుక్కల మధు(35)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Similar News

News February 7, 2026

కాలే కడుపునకు మండే గంజి

image

విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు నోరు కాలేంత వేడి గంజి ఇచ్చినా అది ఎంతో రుచిగా, తృప్తిగా అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేదుగా అనిపిస్తాయి. ఏదైనా వస్తువు లేదా సాయం మనకు బాగా అవసరమైనప్పుడు దాని నాణ్యత కంటే ఆ సమయంలో అది అందడమే గొప్ప విషయంగా భావిస్తాము. నిజ జీవితంలో సరైన సమయానికి లభించే సాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ సామెతను వాడుతుంటారు.

News February 7, 2026

సూర్యుడికి అర్ఘ్యం.. ఎప్పుడు సమర్పించాలంటే?

image

2026, FEB 8న భాను సప్తమి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యోదయ ముహూర్తంలో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్ఠం. మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకే ప్రారంభమవుతుంది. కావున 5:26 AM – 7:13 AM మధ్య పుణ్యస్నానాలు ఆచరించాలి. ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా వదలాలి. ఈ పవిత్ర సమయంలో ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం.

News February 7, 2026

అనకాపల్లి: 10 విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

image

తత్కాల్ స్కీమ్‌లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు రూ.1,000 ఫైన్‌తో ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాల మేరకు రెగ్యులర్, ఒకసారి పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ నెల12వ తేదీ వరకు www.bseap.org వెబ్ సైట్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.