News March 10, 2025
ఖమ్మం: లోక్‌సభలో ఎంపీ రఘురామ అభ్యర్థన

377 నిబంధన కింద తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీరఘురాం రెడ్డి సోమవారం లోక్‌సభలో కోరారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తృతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడం, జాతీయ ఆహార చమురు సరఫరాలో గణనీయంగా దోహదపడతామన్నారు.
Similar News
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
News January 23, 2026
ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
News January 23, 2026
45 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దు: కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు మంజూరైన 45 రోజుల్లోపు పునాది పనులు ప్రారంభించని పక్షంలో, ఆ మంజూరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. రద్దయిన చోట కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఎంపీడీఓలు, తహశీల్దార్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.


