News May 7, 2025

ఖమ్మం: వడదెబ్బతో పది మంది మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైరా మండలంలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది మంది వడదెబ్బతో మృతి చెందారు. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.

Similar News

News February 18, 2026

ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

ఖమ్మం: ‘అభివృద్ధి పనులు, రుణాల రికవరీపై సమీక్ష’

image

జిల్లాలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ బుధవారం సమీక్షించారు. ఉపాధి హామీ పనుల పురోగతి పెంచి, చెల్లింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి చేయాలని, ఎన్‌పీఏల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, గ్రాంట్ల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.