News June 15, 2024
ఖమ్మం: వివిధ పనులపై కలెక్టర్ గౌతమ్ సమీక్ష
ఖమ్మం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై అధికారులతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించి, వాస్తవ అవసరం మేరకు పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News September 19, 2024
కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News September 19, 2024
ఖమ్మం: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. ఖమ్మంలో ఇంటర్ చదువుతున్న యువతి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోగా.. కూసుమంచి మండలం జుజ్జువరావుపేటకు చెందిన యువతి ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. కాగా, ఆదిత్య టౌన్‌షిప్‌కి చెందిన వెంకటరాజా(61) కుటుంబ సభ్యులు మందలించడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.
News September 19, 2024
నేడు పాలేరు పాతకాలువకు నీరు విడుదల
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులోని పాత కాలువ గండీ పనులను ఇరిగేషన్ అధికారులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పాత కాలువకు ఐబీ ఆఫీసర్లు నీటిని విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీటిని విడుదల చేయనున్నారు. పాలేరు పాతకాలువ పరివాహకంలో 60 వేల ఎకరాల వరిసాగు ఉంది.