News October 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 10న దుర్గాష్టమి పండుగ, 11న మహర్నవమి పండుగ, 12న విజయదశమి పండుగ, 13న ఆదివారం సందర్భంగా సెలవులిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 14వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

ఖమ్మం: 1064 టోల్‌ఫ్రీతో అవినీతికి అడ్డుకట్ట: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌లను సోమవారం ఆవిష్కరించారు. 1064 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ పనికైనా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.

News December 8, 2025

ఖమ్మం: అవినీతి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: కలెక్టర్

image

అవినీతి నిరోధక శాఖ (ACB) వారోత్సవాల సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 తో పాటు, వాట్సాప్, ఈమెయిల్ మరియు ACB ఖమ్మం DSP నంబర్ (9154388981) ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

News December 8, 2025

ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

image

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.