News April 22, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.500 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News December 10, 2025
ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఏకగ్రీవాల జోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.
News December 10, 2025
పాల్వంచ వ్యక్తికి ఏడాది జైలు

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.
News December 10, 2025
26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్‌కు రూ.100, ఇంటర్‌కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్‌కు రూ.500, ఇంటర్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


