News February 7, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 70 వేల బస్తాలు..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్‌కు రావడంతో షెడ్‌లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెటకు వచ్చింది.
Similar News
News February 18, 2026
ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2026
జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
ఖమ్మం: ‘అభివృద్ధి పనులు, రుణాల రికవరీపై సమీక్ష’

జిల్లాలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ బుధవారం సమీక్షించారు. ఉపాధి హామీ పనుల పురోగతి పెంచి, చెల్లింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి చేయాలని, ఎన్‌పీఏల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, గ్రాంట్ల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.


