News August 21, 2025
ఖమ్మం: స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ

ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బాలురు 298 మంది చేరారని వెల్లడించారు.
Similar News
News January 16, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT
News January 16, 2026
లీకేజీ సుడిగుండంలో HYD అగ్రీ వర్సిటీ..!

రాష్ట్రంలో ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరున్న రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ సుడిగుండంలో చుట్టుకుంది. లీకేజీ కేసులో నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయగా, 35 మంది అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు. 2014, 2024 మధ్య పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు జరిగినట్లు వైస్ ఛాన్స్‌లర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.


