News November 30, 2025

ఖమ్మం: 20 ఏళ్లుగా ఎన్నికలకు నోచుకోని వార్డులు

image

ఏన్కూరు(M) నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉండగా, అందులో 4 వార్డులు STలకు రిజర్వ్‌ చేయబడ్డాయి. అయితే గ్రామంలో ఒక్క ST ఓటరు కూడా లేకపోవడంతో, ఈ 4 వార్డులు దాదాపు 2 దశాబ్దాలుగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూడా ఈ వార్డులకు నామినేషన్లు వేసే అవకాశం లేదు. అలాగే సర్పంచి కూడా ST రిజర్వ్ కావడంతో ఉపసర్పంచే సర్పంచిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News February 19, 2026

కాజీపేట: శివాజీ జయంతి ఏర్పాట్లలో ఒకరు మృతి.. UPDATE

image

కాజీపేటలో <<19181822>>శివాజీ శోభాయాత్ర ఏర్పాట్లు<<>> చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. దర్గా ప్రాంతానికి చెందిన పోతరబోయిన శివకుమార్, రోహిత్, దినేశ్ ఛత్రపతి శివాజీ జయంతి కోసం ఐరన్ పైపులతో ఏర్పాట్లు చేస్తున్నారు. అవి కరెంట్ వైర్లకు తగలడంతో శివకుమార్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. రోహిత్ చేతికి గాయాలవగా.. దినేష్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు.

News February 19, 2026

T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

image

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.

News February 19, 2026

JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER)<<>>లో 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM, MD, MChఅర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. FEB 24న మెరిట్ లిస్ట్ విడుదల చేసి, FEB 27న ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in