News September 11, 2025

ఖమ్మం: KU పీజీ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్‌) 4వ సెమిస్టర్‌ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్‌ ఏప్రిల్‌, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్‌ జూన్‌, ఎంఏ(ఇంగ్లిష్‌) మొదటి సెమిస్టర్‌ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 14, 2025

సిరిసిల్ల: క్రిటికల్ కేంద్రాలపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పర్యవేక్షణ

image

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ విధానాన్ని ఐడీఓసీలోని కంట్రోల్ సెంటర్ నుండి పరిశీలించారు. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 195 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని వీక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు ఆమె పలు ముఖ్య సూచనలు చేశారు.

News December 14, 2025

MHBD జిల్లాలో 82.84 శాతం పోలింగ్ @1PM

image

మహబూబాబాద్ జిల్లాలో రెండవ విడత ఏడు మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం 69.67 శాతం, చిన్నగూడూరు 86.75, దంతాలపల్లి 88.15, గార్ల 82.06, నర్సింహులపేట 87.81, పెద్ద వంగర 85.85, తొర్రూర్ 83.34 శాతం కాగా.. జిల్లా వ్యాప్తంగా 82.84 ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News December 14, 2025

రాజన్న జిల్లాలో మొత్తం పోలింగ్ 80.78%

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,04,905 ఓటర్లకు గాను 84,747 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో, జిల్లాలో 80.78% భారీ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే, ఇల్లంతకుంటలో అత్యధికంగా 84.64% పోలింగ్ నమోదు కాగా, బోయినపల్లిలో 80.11%, తంగళ్లపల్లిలో 77.72% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.