News September 13, 2025

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి నిర్వహించిన సమీక్షలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక, మౌలిక వసతులపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్, టార్ఫాలిన్లు ఉండేలా చూడాలన్నారు.

Similar News

News December 17, 2025

ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

image

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.

News December 17, 2025

ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

image

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్‌లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.

News December 17, 2025

IPL వేలం.. రాజస్థాన్ టీమ్‌లో కరీంనగర్‌ కుర్రాడు

image

ఐపీఎల్ వేలంలో కరీంనగర్ అబ్బాయి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం రూ.30 లక్షలకు దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన అతణ్ని అంతే ధరకు సొంత చేసుకుంది. ఇప్పటికే HCA అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన చేశారు. అండర్-23 SMATలో 160+ స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అయితే IPLలో రాణించి కరీంనగర్‌కు పేరు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.