News September 12, 2025
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ బి.వేణుతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, మద్దతు ధరలు గ్రేడ్ Aకి రూ.2,389, సాధారణానికి రూ.2,369గా నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, గన్నీ బ్యాగులు, తాగు నీరు, విద్యుత్, రవాణా వాహనాలు వంటి వసతులు కల్పించాలని సూచించారు.
Similar News
News December 7, 2025
నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
News December 7, 2025
ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
News December 7, 2025
సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు

మెదక్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలో పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ రోజు బయలుదేరి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏ.ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపకల్పన చేస్తారని తెలిపారు.


