News April 23, 2025

ఖేడ్: చికిత్స పొందుతూ రేషన్ డీలర్ మృతి

image

కంగ్టి మండల ఎన్కేమూరికి చెందిన రేషన్ డీలర్ మేత్రి.యేషప్ప గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల రేషన్ డీలర్లు కోరారు.

Similar News

News March 13, 2026

ఆల్మట్టి ఎత్తు పెంపు.. కృష్ణా బేసిన్‌లో కలవరం

image

ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా ఎగువ ప్రాజెక్టు మూడో విడతలో భాగంగా ఎత్తు పెంచి 130 నుంచి 250పైగా TMCల అదనపు నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి TG, AP దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పాలమూరు నీటి లభ్యత భారీగా తగ్గిపోనుంది. భూ సేకరణ, పునరావాసానికి కర్ణాటక ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది.

News March 13, 2026

ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

image

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.