News November 19, 2025

ఖేడ్: ‘రైతులకు ఆధునిక పరిష్కారం’

image

ఖేడ్‌లో జరిగిన బాల వైజ్ఞానిక సదస్సులో గుమ్మడిదల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ‘రైతు మిత్ర’ అనే పరికరం ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట కోత అనంతరం ధాన్యాన్ని ఎండబెట్టుకునే రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ సులభమైన యంత్రాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతుల కష్టాన్ని తగ్గించి, వారి పనిని సులభతరం చేసే యంత్రాన్ని అభివృద్ధి చేసినట్లు విద్యార్థులు తెలిపారు.

Similar News

News January 19, 2026

నారాయణపేట: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

image

నారాయణపేట జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News January 19, 2026

పిన్నెల్లి సోదరుల పోలీసు విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్

image

జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. ఈ కేసులో లోతైన విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వీరిని విచారించనున్నారు.

News January 19, 2026

ఏలూరు: బాలికను దత్తత తీసుకున్న విదేశీయులు

image

ఏలూరు శిశుగృహలో ఆశ్రయం పొందిన బేబీ ప్రజ్వల అనే 18 నెలల ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా విదేశీయులు సోమవారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార (CARA) వారి విదేశీ దత్తత నియమ నిబంధనలు ప్రకారం అన్ని విధానాలు అమలుపరచి అమెరికాలో నివసిస్తున్న రాయ్- సామ్యూల్ బెంజమిన్, లోరీయన్ బెంజమిన్ దంపతులు బేబీని దత్తత తీసుకున్నారన్నారు.