News August 23, 2025

గంగాధర నుంచి జనహిత పాదయాత్ర: MLA

image

క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి PCC అధ్యక్షుడు మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథులుగా రేపు చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర నిర్వహించనున్నారని MLA మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల నుంచి మధురానగర్ చౌరస్తా వరకు జనహిత పాదయాత్ర కొనసాగుతుందని శనివారం తెలిపారు. పాదయాత్రలో డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొంటారని చెప్పారు.

Similar News

News January 24, 2026

నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ తప్పనిసరిగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010’ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఆర్ఏ కమిటీకి సమర్పించిన ప్రైస్ లిస్ట్ ప్రకారమే రోగుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఆసుపత్రిలో సిబ్బంది మారితే అధికారులకు తెలపాలన్నారు.

News January 24, 2026

జిల్లాల విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదు: నాయిని

image

జిల్లాల విభజనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అవుతుందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు బట్టలు చించుకుంటోందో చెప్పాలని స్పష్టం చేశారు.

News January 24, 2026

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in